calender_icon.png 24 January, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది

24-01-2026 10:12:06 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని పోచారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మండల అధ్యక్షుడు కర్రే రాజేష్ శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతుందన్నారు. ఇకముందు కూడా ఎవరైనా ఇండ్లు నిర్మించుకోవాలి అనుకున్న వారు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తులు చేసుకోవాలని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం మంజూరి చేస్తుందన్నారు. ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ మాట్లాడుతూ... ఇంటి ముందు స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా రూ. 5 లక్షలు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తుందని అనడానికి ఈ ఇల్లు నిదర్శనం అన్నారు.

ఇచ్చిన మాట తప్పకుండా పేద ప్రజల అభివృద్ధికై నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నoటూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్ర మాధవి, ఘట్ కేసర్ మండల యూత్ అధ్యక్షుడు వినోద్ కుమార్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, బద్దం మల్లికార్జునరెడ్డి, ఎర్ర రాజు, నాయకులు నరేష్ గౌడ్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.