calender_icon.png 25 January, 2026 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

24-01-2026 09:53:53 PM

డిఎల్ఎస్ఏపిఎల్వి గుండెబోయిన రామకృష్ణ

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): శనివారం జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని, డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆళ్లపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం గుండెబోయిన రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఎల్వి రామకృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని 18 సంవత్సరాలు వయోపరిమితి నిండని బాలికకు 21 సంవత్సరం నిండని అబ్బాయికి కలిపి వివాహం చేస్తే అది బాల్య వివాహంగా పరిగణించబడుతుందని అలా ఎవరైనా చేసినట్లయితే లక్ష రూపాయల జరిమానా అలాగే జైలు శిక్ష అలాగే ఆ వివాహానికి హాజరైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ర్యాలీ మరియు బాల్య వివాహ నిర్మాణంలో భాగంగా గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కే శాంతారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.