28-07-2025 05:42:37 PM
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి..
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మండలంలోని నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(BJP District President Gangadi Krishna Reddy) పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపళ్లి రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో పార్టీ విజయం కొరకు నాయకులు, కార్యకర్తలు తగిన కార్యాచరణతో ముందుకు కొనసాగాలన్నారు. ఎన్నికల కోసం బూత్ కమిటీని సన్నద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి, శక్తి కేంద్ర ఇన్చార్జులు కడార్ల రతన్ కుమార్, వేముల అనిల్ కుమార్, కోమటిరెడ్డి అంజన్ కుమార్, సోమినేని కర్ణాకర్, గుడిసెల రంజిత్ కుమార్, పోర్తి అనిల్ కుమార్, బోనాల నరేష్, కడారి శ్రీనివాస్, బోయిని మహేందర్, కట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.