28-07-2025 05:34:58 PM
20 నెలల కాలంగా కరకట్ట పనులు సాగుతూనే ఉన్నాయి..
మరి ఎప్పుడు పూర్తవుతుంది..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం మండలంపై గులాబీ జెండా ఎగరాలి..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వంలో కేటాయించిన కరకట్ట నిర్మాణ పనుల నిధులు పక్కదారి పట్టాయని టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు(BRS District President Rega Kantha Rao) ఆరోపించారు. సోమవారం భద్రాద్రి పర్యటనకు వచ్చిన రేగా కాంతారావు భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రెడ్డి సత్రం రోడ్లో కరకట్ట రిటైలింగ్ వాలు కూలిపోయి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోనే స్థితిలో లేదన్నారు.
భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో 28 నెలల కాలంలో ప్రజలకు చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు పెరిగాయని, స్థానిక ఎన్నికల్లో భద్రాచలం మండలంపైన గులాబీ జెండా ఎగరాలని కార్యకర్తలు అందరూ సంసిద్ధంగా ఉండి 420 హామీలు అమలు కొరకు ప్రజలు చైతన్యవంతం చేయాలని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ మానే రామకృష్ణ,మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల సీనియర్ నాయకులు పోల్లం జయ ప్రేమ్ కుమార్, అయినాల రామకృష్ణ, సోషల్ మీడియా అధ్యక్షులు మంది నాగేశ్వరరావు, బాసిబోయిన మోహన్ రావు, దుమ్ముగూడెం మండల నాయకులు రావులపల్లి పృథ్వి, లంక పల్లి విశ్వనాథ్, మహిళా నాయకులు ప్రియాంక తదితరులు ఉన్నారు