calender_icon.png 28 July, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరిలో నారు పనులు పెంచడం ద్వారా పరుగు ఉధృతి నివారణ

28-07-2025 05:11:17 PM

మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి...

మందమర్రి (విజయక్రాంతి): వరిలో నారు కొనలు తుంచడం ద్వారా ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవడమే కాకుండా పురుగుమందుల పిచికారి రూపంలో పెట్టుబడి కూడా తగ్గుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Muthyam Tirupati) తెలిపారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడిపల్లి గ్రామంలో సోమవారం వరిసాగులో నారు కొనలు తుంచడంపై రైతులకు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరి నాట్ల సమయంలో కొనలు తుంచడం ద్వారా పురుగు మందుల పెట్టుబడి తగ్గడమే కాకుండా నేలను వాతావరణాన్ని కాలుష్యం బారి నుండి కాపాడుకోవచ్చుననీ ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా నాట్ల సమయంలో ఒక గుడ్డకు రెండు నుంచి మూడు నారు కర్రలను మాత్రమే వినియోగించాలని, గుడ్డకు గుడ్డకు మధ్య కేవలము 15 సెంటీమీటర్ల ఎడం ఉంచాలని అన్నారు. నారు కర్రలను ఎక్కువగా వినియోగించడం ద్వారా గాలి, వెలుతురు, పోషకాల వినియోగంలో కర్రల మధ్య పోటీ ఏర్పడి సరైన పిలకలు రాక దిగుబడులు తగ్గు తాయని, ఒక గుడ్డకు కేవలం రెండు నుంచి మూడు నారు కర్రలను మాత్రమే వినియో గించాలన్నారు. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను మహిళా రైతు కూలీలు పాటిస్తూ రైతు సోదరులు సరైన దిగుబడులు పొందడానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు జమ్మిడి రాజయ్య, రైతు కూలీలు పాల్గొన్నారు.