calender_icon.png 29 July, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్ బాక్సర్ల ప్రభంజనం

28-07-2025 05:29:39 PM

సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్ బాక్సర్ల ప్రభంజనం తేదీ 26, 27 శని ఆదివారాలలో స్థానిక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం నందు బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కిక్ బాక్సింగ్ ఇండియా ఉమెన్స్ లీగ్(Kickboxing India Women's League)లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కిక్ బాక్సర్లు మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 మంది  చిల్డ్రన్, కెడేట్, జూనియర్ వయసు గలవారు పాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్, క్రియేటివ్ ఫామ్ విభాగాలలో పాల్గొని ఆరు బంగారు పతకాలు నాలుగు వెండి పథకాలు ఐదు కాంస్య పథకాలతో 15 పథకాలు సాధించారని జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు.

పథకాలు సాధించిన కిక్ బాక్సర్ల వివరాలు బంగారు పథకాలు ఫైట్ విభాగంలో లైట్ కాంటాక్ట్ జూనియర్ విభాగంలో గంగనవేణి ప్రవళిక చిల్డ్రన్ పాయింట్ ఫైట్ విభాగంలో ఎల్లే ప్రణవి, గజ్జెల హిరణ్మయీ కెడేట్ పాయింట్ ఫైట్ విభాగంలో గజ్జెల శ్వేదిక కర్నె యుతికలు సాధించారు. ద్వితీయ వెండి పథకం సాధించిన కిక్ బాక్సర్లులక్ష్మిప్రసన్న ప్రణవి, హిరణ్మయీ శ్వేదిక అలాగే కాంస్య పథకాలు సాధించినవారు కంచర్ల శ్రీనిక, లింగంశ్లోక లక్ష్మీప్రసన్నలు సాధించారని స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ జనరల్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. పథకాలు సాధించిన కిక్ బాక్సర్లను, తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ మహిపాల్, అలాగే జిల్లా కోచ్ యేనగందుల శ్రీనివాస్ లు అభినందిచారని జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఇట్టి  ఉమెన్స్ లీగ్ లో రెఫెరీగా వోడ్నాల శ్రీనివాస్, యేనగందుల శ్రీనివాస్ కు అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.