భూనిర్వాసితులకు రూ.94 కోట్లు ఇవ్వాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే వినతి
ఆదిలాబాద్,మే 30 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ నియోజకవర్గంలోని చెనాక కొరాట బ్యారేజ్ కింద భూములు కోల్పోయిన నిరాసితులకు వెంటనే రు.94 కోట్ల పరిహారం అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. గురువారం హైదరాబాదులో సీఎంను కలిసి సమస్యలు విన్నవించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైలే అండర్ బ్రిడ్జి, రైలే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయని తెలిపారు. పట్టణంలో భూసేకరణ కింద ప్రభుతం బాధితులకు రూ.27 కోట్లు చెల్లించాల్సి ఉందని విన్నవించారు. విత్తనాలు దొరక్క పత్తి రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాల పంపిణీ చేపట్టాలని కోరారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించా రని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు కూడా పాయల్ శంకర్ వినతిపత్రం అందించారు.






