జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులో రాయితీ కల్పించాలి
- విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు డీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, బీ రాజశేఖర్, కార్యదర్శులు జగదీశ్వర్, గండ్ర నవీన్, కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్ తదితరులు గురువారం సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేషంను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రత్యేక కోటా కింద అడ్మిషన్లు కల్పించాలని, అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించే విధంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.






