calender_icon.png 14 July, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అభినందనీయం

13-07-2025 08:34:47 PM

ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్..

50 ఏళ్లు దాటిన వయస్సులోనూ క్రికెట్‌తో జ్ఞాపకాలు నెమరేసిన స్నేహితులు..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1986 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్(SP Gaikwad Vaibhav Raghunath) పాల్గొని ఈ సమ్మేళనాన్ని అభినందనీయం అంటూ ప్రశంసిస్తూ వారితో పాటు క్రికెట్ ఆడి సంతోషాన్ని పంచుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయికలు స్నేహబంధాలను మరింతగా బలపరచడమే కాకుండా, బాల్య జ్ఞాపకాలను తిరిగి జలపరిచే వేదికలవుతాయి. విద్యార్థి దశ జీవితంలో కీలకమైనది.

ఆ దశను తిరిగి నెమరేసుకునే అవకాశం అందరికీ రాలేదు. అలాంటి మధుర క్షణాలను పునరావృతం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయంగా రూ. 20 వేలను ఆర్వో ప్లాంట్ నిర్వహణ కోసం అందించారు. అలాగే గగ్గలపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలకు రెండు క్రికెట్ కిట్లు అందచేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు, అమెరికా, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్నేహితులతో మళ్లీ కలుసుకోవడం మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు.