calender_icon.png 14 July, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమున్నామంటూ.. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం

13-07-2025 08:18:16 PM

పెన్ పహాడ్: మేమున్నామంటూ స్నేహితుని కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన గర్నె బాలయ్య ఈనెల 4వ తారీఖున గుండెపోటుతో అకాల మరణం చెందాడు. మృతుడు బాలయ్యకు భార్యతో పాటు ఇద్దరు స్కూల్ లో చదువుకునే చిన్న పిల్లలు ఉన్నారు. తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని ముందుకు వచ్చిన నాగులపాటి అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులంతా కలసి రూ. 30 వేల ఆర్థిక సహాయాన్ని మృతుడు బాలయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్నేహాతులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కోన వెంకన్న, నకేరకంటి వెంకన్న, బోగరాజు వెంకన్న, బాదే శ్రీనివాస్, మీసాల సైదులు, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.