calender_icon.png 14 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి

13-07-2025 08:43:27 PM

సామాజిక కార్యకర్త బషీరుద్దీన్..

కోదాడ: ఇందిరమ్మ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త బషీరుద్దీన్(Social Activist Bashiruddin) కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీ వాసులకు 2007 జనవరి 6న భూమి పూజతో ప్రారంభమై 54 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి కోదాడ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న 20 వార్డుల్లోని లబ్ధిదారులందరికీ గ్రామసభల ద్వారా ఎంపిక చేసి స్థలాలు కేటాయించారు. 18 సంవత్సరాలు గడుస్తున్న నీటికి ఇంటి పట్టాలు ఇవ్వక మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేక కాలనీవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పట్టాలు ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్షకు సైతం సిద్ధమని బషీరుద్దీన్ తెలిపారు. ఎడవల్లి భాస్కరరావు మామిడి శంకర్ నాగేశ్వరరావు నన్నేసాహెబ్ సిద్దయ్య నరేష్ డాక్టర్ పాషా నరసింహ బడే మియా వెంకటరత్నం అబ్దుల్లా పెంటు కోపూరు అన్నపూర్ణ సరోజా దేవి మేరీ ఖాజావి అమీనా షాహిదా పాల్గొన్నారు.