calender_icon.png 14 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కాళేశ్వరుడుని దర్శించుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు

13-07-2025 08:36:49 PM

మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh Kumar Goudదర్శించుకున్నారు. ఉదయం టీపీసీసీ అధ్యక్షులు శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం వద్దకు రాగా వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు, అనంతరం దేవాలయంలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ద్వీలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సుభానంద దేవి అమ్మవారికి కుంకుమ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు స్వామివారి శేష వస్త్రములను అందజేసి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు నగేష్ శర్మ, దేవాలయం సూపరిండెంట్ బుర్రి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, శ్రీనివాస్ రెడ్డి, లేతకారి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.