13-07-2025 08:23:13 PM
కోదాడ: కోదాడ మండల(Kodad Mandal) పరిధిలోని గణపవరం గ్రామంలో గత 4 రోజులుగా జరుగుతున్న వరవర రంగనాయక స్వామి పవిత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి, ధర్మకర్తలు బి సైదులు, నాగలక్ష్మి, బిక్షం, సీతయ్య, కె నాగేశ్వరరావు, కె గురవయ్య, కృష్ణమాచార్యులు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, పుష్పమ్మ, మంగమ్మ, దేవా, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.