13-07-2025 07:50:03 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల(Mutharam Mandal) కేంద్రానికి చెందిన ఇనుముల ఓదెలు ఇటీవల కాసర్ల గడ్డలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనతో ఓదెలు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద సమయంలో ఓదెలు కొడుకు కుమార్ కు మిత్రులు సంఘీభావంగా ముందుకొచ్చారు. సహచర మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా తోడుండాలనే ఉద్దేశంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుమార్ తల్లికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు అంజి ప్రసాద్, ప్రవీణ్, ఆఫ్రిద్, ప్రశాంత్, చిరంజీవి, అనిల్, సందీప్ పాల్గొన్నారు.