calender_icon.png 14 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డు అందుకున్న బత్తుల సరిత

13-07-2025 08:46:04 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సామాజిక సేవ డాక్టరేట్ అవార్డు పట్టణానికి చెందిన బత్తుల సరిత అందుకున్నారు. ఆదివారం సంస్థ ఆధ్వర్యంలోని వరంగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందుకుగాను సరితకు డాక్టరేట్ అందించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ సంస్థ అధినేత డాక్టర్ మాచవరం గౌరీ శంకర్, బట్టు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ అవార్డును అందుకోవడం సంతోషకరంగా ఉందని ఆమె అన్నారు. కాగా అవార్డు అందుకున్న సరితను పలువురు పట్టణ ప్రముఖులు బంధుమిత్రులు అవినందించారు.