calender_icon.png 24 December, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు క్రిస్మస్ వేడుకలు

24-12-2025 10:10:24 AM

ముకరంపురా,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సి.ఎస్.ఐ కేథడ్రిల్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముందస్తు క్రిస్టమస్ పండుగ వేడుకలకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని చాటిన ఏసు ప్రభువు ఆశీర్వాదం అందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  వేడుకల్లో ప్రభుత్వ అధికారులు, సి ఎస్ ఐ చర్చ్ బాధ్యులు పాల్గొన్నారు.