24-12-2025 10:08:29 AM
జడ్చర్ల: నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా ఆర్టిసి పనిచేస్తుందని జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ కే శివరాజ్ అన్నారు. బుధవార ప్రయాణికురాలు లక్ష్మీదేవి కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా జడ్చర్లలో లక్ష్మీదేవి బస్సు దిగారు. లక్ష్మీదేవి ప్రయాణించిన bus no TS09Z7903 ( SUPER LUXURY) బస్సులోనే ఫోన్ మర్చిపోయినది.. డ్యూటీలో ఉన్న జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ శివరాజ్, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ నర్సింలు కు తిరిగి లక్ష్మీదేవి బస్సులోని తన ఫోను మర్చిపోయినట్లు సమాచారం అందించారు. ఆ బస్సు డ్రైవర్ ఫోన్ కొనుక్కొని ప్యాసింజర్ లక్ష్మీదేవికి కు ఫోన్ అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది కి ప్రయాణికురాలు లక్ష్మీదేవి కృతజ్ఞతలు తతెలిపారు.