24-12-2025 10:12:03 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో ఇటీవల సర్పంచ్ల ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య సర్పంచులైన పస్థాల సర్పంచ్ బుక్కా శ్రీనివాస్ గుప్తా, టేకుమట్ల సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్ గుప్తా ,వెంకేపల్లి సర్పంచ్ ఇమ్మడి జయకుమార్, జాజిరెడ్డిగూడెం సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, వెలుగుపల్లి ఏడవ వార్డు మెంబర్ గుండా శ్రీనివాస్ లను తుంగతుర్తి మండల మహాసభ సంఘం ఆర్యవైశ్యులు పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న. జిల్లా ఉపాధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ఈగ లక్ష్మయ్య, ఓరుగంటి శ్రీనివాస్ ఓరుగంటి సుభాష్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, మా శెట్టి వెంకన్న, దారం కృష్ణమూర్తి, ఈగ శీను, కొమటాల సత్యనారాయణ, శనివిరాల మల్లయ్య, గుండా మురళి తదితరులు పాల్గొన్నారు.