22-12-2025 07:05:14 PM
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లు ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలో అంబరాన్ని అంటే విధంగా సాగాయి. మంథని ప్రధాన కూడలి గాంధీ చౌక్ లో పండుగ వాతావరణం నెలకొంది. కేక్ కటింగ్ తో పాటు చిన్నారుల నృత్యాలు, క్రైస్తవ గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి వాక్యం ఉపదేశకులుగా విచ్చేసిన కొండ్ర హానోక్ క్రీస్తు జన్మ విశిష్టతను వివరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా వ్యవసాయ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న , విద్యుత్ సలహా మండలి సభ్యులు శశిభూషణ్ కాచే , మైనారిటీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్ అప్స అభరర్, మంథని తాసీల్దార్ మహమ్మద్ అరిఫోద్దీన్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్ , మంథని ఆర్ ఐ పిఎసిఎస్ ఎక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ , మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్, హాజరై క్రిస్మస్ ఆశీస్సులు అందరి పై ఉండాలని, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో సిసిఓసి కమిటీ ప్రెసిడెంట్ ఐతు ఎలీషా, ఎంసీపీఎఫ్ కమిటీ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్, వైస్ ప్రెసిడెంట్ జయరాజు, జనరల్ సెక్రెటరీ కన్నూరి అశోక్, కోశాధికారి ఆర మల్ల దైవకృపాకర్, జోషి కమిటీ సభ్యులు సిహెచ్ సుదర్శన్ , కాసిపేట జోసఫ్ , మంథని నవీన్, పాస్టర్లు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.