22-12-2025 08:14:36 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): సోమవారం రోజున సిపిఐ కరీంనగర్ నగర కౌన్సిల్ సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా జరిగిన పోరాటాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఘనమైన చరిత్ర ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ లేకపోతే తమకు ఎవరు పోటీ ఉండరు అనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పోరాట ఉద్యమ చరిత్ర వక్రీకరిస్తుందని ఆయన ఆరోపించారు.
సిపిఐ పార్టీ పుట్టి 100 సంవత్సరాల అయిందని ఇది దేశంలో పోరాటం చేసిన చరిత్ర ఏ పార్టీకి లేదని అన్నారు. కరీంనగర్ నగరంలో కమ్యూనిస్టు పార్టీకి కార్పొరేటర్ లేక పోయినప్పటికీ పేదల భూమి పంపిణీ చేపట్టిందని, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పించిందని, గుర్తు చేశారు. పేద ప్రజల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర సిపిఐ కి కరీంనగర్ లో ఉందన్నారు. భవిష్యత్తులో సిపిఐ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని బీజేపీ పార్టీ కి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.