calender_icon.png 22 December, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాడు ఎంపీపీగా.. నేడు సర్పంచ్‌ గా ప్రమాణం.

22-12-2025 08:10:29 PM

విజయక్రాంతి,పాపన్నపేట: తెరాస ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు నాడు పాపన్నపేట ఎంపీపీగా.. నేడు బాచారం గ్రామ సర్పంచ్‌గా ఆమె ఎన్నికైంది. మండల పరిధిలోని బాచారం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా సొంగ పవిత్ర దుర్గయ్య డిసెంబర్ 11న గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారాస మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పావని గణేష్ పై 22 ఓట్ల మెజారిటీ తో  గెలుపొందారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బాచారం గ్రామ అభివృద్ధికీ కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.