22-12-2025 07:02:56 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ మండలం రాజంపేట, గుండి, కౌటగూడ గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు బుర్స పోచయ్య, జాబరి రవీందర్, కుడిమేత స్వప్న–లక్ష్మి నారాయణ, ఉపసర్పంచులు మడవి లక్ష్మి, సీహెచ్ సంతోష్, భీమయ్య, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరస్వతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.