calender_icon.png 22 December, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన సర్పంచులు

22-12-2025 08:07:51 PM

మోతే,(విజయక్రాంతి): సోమవారం మండలంలోని 28 గ్రామాలకు చెందిన సర్పంచ్ లు వేద మంత్రాలతో తమకు నచ్చిన దేవుని ఫోటోలకు పూజలు చేసి ఆయా గ్రామాల గ్రామ ప్రేత్యేక అధికారులు ప్రమాణ పత్రాలు చదివి పదవి బాధ్యతలను చేపట్టారు. 29 గ్రామాల ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి పదవులు అలంకరించారు. మోతె గ్రామ సర్పంచ్ గా దోసపాటి అనురాధ, హుస్సేనా బాద్ సర్పంచ్ గా అక్కిన పల్లి శ్రీరాములు, మామిళ్ళ గూడెం కొరవి నాగమణి, కొత్తగూడెం గడ్డి కొప్పుల శేషి రెడ్డి, తుమ్మల పల్లి వాసం శెట్టి అరుణ,  రావి పహాడ్ కోడి లింగయ్య, సిరికొండ బొర్ర వెంకటేష్, గోప తండా భూక్యా బిక్కు నాయక్,

నేరడవాయి దారమళ్ళ గోవర్ధన్, అన్నారి గూడెం ఇంద్రాల సుప్రజ, ఉర్లుగొండ మొక్క వెంకటేశ్వర్లు,  రాఘవ పురం మద్ది మంజుల, రాఘవ పురం ఎక్స్ రోడ్డు కోల లింగయ్య, నామ వరం దైద శ్రవణ్, అప్పన్న గూడెం సండ్ర ప్రసాద్, భల్లుతండా భూక్యా మల్సూర్, భిక్య తండా హలవత్ స్వామి, బోడబండ్ల గూడెం కాంపల్లి ఉమా, బుర్కాచర్ల ధరవత్ కవిత, గోల్ తండా ధారవత్ భారతి, కరకాయలగూడెం యాతకుల విజయలక్ష్మి, కూడలి బర్మవత్ మల్సూర్, లాల్ తండా తేజవత్ అండాలు, నర్సింహా పురం వాంకుడోత్ బేబీ, రాంపురం తండా బానోతు సత్తెమ్మ, రాయికుంటతండా భూక్యా ఉప్పయ్య, సర్వారం మూడు నాగేష్, తుమ్మ గూడెం కుక్క ధనమ్మ, విభళ్ళపురం గుండ్ల చంద్ర కళ, లు సర్పంచ్ లు గా ప్రమాణం చేసి భాద్యత లు చేపట్టారు.

మండల కేంద్రంలో ఉప సర్పంచ్ గా బొక్క ఉపేందర్ రెడ్డి, గోపతండ ఉప సర్పంచ్ గా మాలోతు ఈశ్వరి రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి టి ఆంజనేయులు, తహసీల్దార్ యం వెంకన్న, డిటి పుష్ప, ఆర్ఐలు కర్ణాకర్ రెడ్డి, రమేష్, ఏఓ అరుణ, ఏఇఓ లు పలు శాఖల అధికారులు సర్పంచ్ లు వార్డు సభ్యులకు ప్రమాణం చేయించారు.