22-12-2025 08:22:36 PM
తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలం సకినాపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెస్రం నిఖిత నగేష్, ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ గా ఆత్రం సంతోష్, 8 మంది వార్డు మెంబర్లు సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారమహోత్సవంలో గ్రామ ప్రత్యేక అధికారి కీర్తి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన మెస్రం నిఖిత నగేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు సకినాపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సకినాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ పంచాయతీ సెక్రటరీ జ్యోతి, గ్రామ పటేల్, కుంరం మాణిక్ రావు, మెస్రం మాధవ్ రావు, కుమ్రా హనుమండ్లు, మెస్రం శంబు, నైతం అయ్యు, గ్రామ ప్రజలు ఉన్నారు