calender_icon.png 24 December, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ పాలకులను సన్మానించిన ముదిరాజ్ సంఘం

24-12-2025 07:57:48 PM

కాటారం,(విజయక్రాంతి): గ్రామపంచాయతీకి నూతనంగా  ఎన్నికైన సర్పంచ్ పంతకాని సడవలి,  ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, వార్డు మెంబర్లు కొండ రాజమల్లు, కొండ రాము, కొండపర్తి జ్యోతి, కొర్ర శ్రీకాంత్  లను కాటారం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఓలపు రాజబాబు ఆధ్వర్యంలో సంఘ సభ్యులంతా  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని పూల బోకేలు,  శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... ముదిరాజ్ కుల సంఘం సభ్యులు అందరూ సన్మానించడం సంతోషంగా ఉందని, నిర్మించతలపెట్టిన పెద్దమ్మ గుడి నిర్మాణానికి తమ వంతు సహాయ సహాకారాలు అందిస్తామని సర్పంచ్ సడవలి అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ, గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. కాటారం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఒక సేవకుడి లాగా పని చేస్తామని అన్నారు.