24-12-2025 08:10:58 PM
సర్పంచ్ దుర్గం సరోజ
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సర్పంచి దుర్గం సరోజ అన్నారు. బుధవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బెజ్జూర్ మండల కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం, తీర్మానించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డ్ ల వారీగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఏటి కూడా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్, కార్యదర్శి వైకుంఠం. వార్డు సభ్యులు పాల్గొన్నారు.