calender_icon.png 24 December, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం వస్తే జడ్పిటిసి స్థానానికి బరిలో ఉంటా...

24-12-2025 07:54:23 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రానున్న జెడ్పిటిసి ఎన్నికల్లో అవకాశం వస్తే నాగిరెడ్డి పేట మండలం జడ్పిటిసి స్థానానికి బరిలో ఉంటానని అచ్చయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొంపల్లి శైలజ దినకర్ తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో ఎలా గెలిపించారో, అదేవిధంగా రానున్న జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మల్లొకసారి ఆదరించాలని కోరుతున్నానని అచ్చయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొంపల్లి శైలజా దినాకర్ తెలిపారు.

గత ఐదు సంవత్సరాలు సర్పంచిగా చేశాను కాబట్టి ఎంతో కొంత పరిచయాలు అనుభవాలు ఉన్నాయని అలాగే ఆర్థికంగా చదువుపరంగా ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి మేలు చేకూరుస్తానని అలాగే నాగిరెడ్డిపేట్ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందు ఉంచుతానన్నారు.మండల ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు.