9 March, 2026 | 5:03 PM

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు..కిటకిటలాడిన చర్చీలు

26-12-2025 12:13 AM

పాపన్నపేట, డిసెంబర్ 25 :వెలుగులు వి రజిమ్మే కొవ్వొత్తుల కాంతులు.. క్రిస్మస్ చె ట్లు.. బాల యేసు జన్మ వృత్తాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు క్రైస్తవ సోదర, సో దరీమణులతో కిటకిటలాడాయి.

ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవాలయాలు మార్మోగాయి. సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శాంతి సందేశాలు చేశారు.