26-12-2025 12:14:43 AM
ఎంఎస్‌ఎఫ్ పుర్రా మహేష్
కొల్చారం, డిసెంబర్ 25 :హామీలు అమ లు పరచడంలో సర్కార్ విప్లమైందని ఎంఎస్‌ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ చెప్పిన హామీలు నెరవేర్చడం లేదన్నారు.
రా జీవ్ యువ వికాసం చేవెళ్ల డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని హామీ నీరుగారిపోయిందన్నారు. రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారని, హామీలు అమ లు పరచడం చేతకాకపోతే రాజీనామా చే యాలని డిమాండ్ చేశారు.