23-12-2025 09:57:42 AM
తూప్రాన్,(విజయక్రాంతి): మండలంలోని కిష్టాపూర్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్ గా బామని రవీందర్, వార్డు సభ్యులుగా నాగరాజు, గుజారి నర్సింలు, మోర ఆంజనేయులు, మోర యాదమ్మ, దొంతి సౌజన్య, లతీఫ్, మన్నె పుష్ప లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పుర ప్రముఖులు, గ్రామస్తులు నూతన పాలక వర్గాన్ని సన్మానించారు.