23-12-2025 09:40:38 AM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా(Vikarabad District) పోడూరు మండలం రాకంచర్లలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో కారు కిందపడి చిన్నారి మృతి చెందింది. రాత్రి ఊరేగింపులో బాలిక మీద నుంచి మహిళ సర్పంచ్(Sarpanch) కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.