06-10-2025 07:44:05 PM
సనత్ నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ సీఐ శ్రీనివాసులు సనత్ నగర్ బస్టాండ్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళలో బస్టాండు సమీపంలో యాచకులు ఎంతోమంది ఉండటంతో బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండడంతో అక్కడ రాత్రిపూట యాచకులు పండుకోవటం మంచిది కాదని వాళ్లకు చెప్పి వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని యాచకులను హోంకి పంపించే ఏర్పాట్లు చేశారు. షెల్టర్లు లేని వాళ్ళు పనిచేసుకునే వాళ్లను కూడా వాళ్ళ ఆధార్ కార్డులను గుర్తించి వాళ్ల దగ్గర కూడా ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్లకు కూడా హోమ్ కి పంపించే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల రాత్రిపూట జనాభా లేకుండా చూసుకోవాలని అక్కడ ఉన్న హోటల్ యాజమాన్యానికి సూచించారు. ఈ మధ్యకాలంలో 25 మందికి పైగా యాచుకులను ఆలేటి ఆశ్రమం అబ్దుల్లాపూర్ మెట్ హోం కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.