06-10-2025 07:47:16 PM
బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన పంతుల తండా..
ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ..
మరిపెడ/దంతాలపల్లి (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పంతులు తండా ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గిరిజన కుటుంబాలు తండాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.