27 మంది సైనికులను సన్మానించిన సీఐ
నారాయణఖేడ్, జూన్ 19: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మం డలంలో రాయిపల్లిలో ఎస్బిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 27 మంది అభ్యర్థులు అగ్నివీర్ కు ఎంపిక కావడం జరిగింది. దీంతో నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులను గురువారం ఘనంగా సన్మానించారు.
మారుమూల ప్రాంతంలో యువతకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్బిఐ ఫౌండేషన్ వారిని అభినందించారు. భవిష్యత్తులో కూడా మరింత మంది యువతను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మనూరు ఎస్సై కోటేశ్వర్ రావు, ఎంఈవో రాజశేఖర్ షెట్కర్, ఎస్బిఐ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జాంగిర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలమ్మ, గ్రామ పెద్దలు ఖమరుద్దిన్, ఫజిల్ హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






