07-10-2025 07:39:47 PM
మంథని (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపల్లి గ్రామానికి చెందిన గంట మహేష్ గౌడ్ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన సందర్భంగా మంగళవారం మంథని పోలీస్ స్టేషన్ లో మంథని సీఐ రాజు మహేష్ గౌడ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహేష్ పేద కుటుంబం నుండి వచ్చి చదువులో సత్తా చాటుతున్నాడని, అతనిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కూడా చదువులో రాణించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మహేష్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పెద్దపల్లిలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా గ్రూప్-3 ఫలితాల్లో 21 ర్యాంకు సాధించాడు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రిపరేషన్ సమయంలో మార్గదర్శిగా ఉన్న మహావాది సతీష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.