calender_icon.png 7 October, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

07-10-2025 07:42:50 PM

పోతారంలో గ్రామస్తులకు అవగాహన సదస్సులో ఎస్సై రవికుమార్..

ముత్తారం (విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ముత్తారం ఎస్సై రవి కుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పోతారం గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ప్రజానీకంతో మమేకమై అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ఎలాంటి గొడవలు సమస్యలు తలెత్తకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గొడవలకు దూరంగా ఉండాలని, అందరూ సోదరభావంతో మెలగాలని, ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని గ్రామ ప్రజానీకం సహకరించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విపిఓ శ్రావణ్ రెడ్డి, పోలీసు సిబ్బంది రాజు, సుమంత్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.