16 April, 2026 | 7:59 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మానవత్వం చాటుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్

02-02-2026 07:58 PM

మఠంపల్లి: అగ్నిఖిలలు చుట్టుముట్టి గూడు కాలిపోయిన ఘటనలో సర్వం కోల్పోయిన దంపతులను ఓదార్చి ఆదుకున్నారు. హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి నిత్యావసర సరుకులు, బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు.

జనవరి 30వ తారీఖున మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన షేక్ ఖాసిం ఆశ దంపతులకు చెందిన గృహం ఫైర్ యాక్సిడెంట్ జరిగి అగ్నిఖిలల్లో ఆహుతైంది. దీంతో గృహంలో ఉన్న కొంత డబ్బు బంగారంతో పాటు సర్వం కాలి బూడిదయ్యాయి. ఈ విషయం పై స్పందించిన సీఐ చరమంద రాజు మఠంపల్లి ఎస్సై బాబుతో కలిసి సోమవారం ఆ దంపతులను కలసి ఓదార్చి నిత్యవసర సరుకులతో పాటు బియ్యం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.