calender_icon.png 15 September, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలతో పెట్టుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కూడా పడుతుంది

15-09-2025 06:26:11 PM

సీఐటీయూ నేతలు దొడ్డ రవి, కె సత్య, భూక్యా రమేష్ హెచ్చరిక..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఆరు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రీ ప్రైమరీ స్కూల్ లను అంగన్వాడీలోనే కొనసాగించాలని ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్(CITU District Vice President Dodda Ravi Kumar), సహాయ కార్యదర్శి కే సత్య ,జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి అంగన్వాడి సమస్యలు, సెంటర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీడింగ్ కోసం ఎఫ్ ఆర్ ఎస్ స్కీమును తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారని వారు అన్నారు. ఎఫ్ ఆర్ ఎస్ స్కీమును రద్దు చేయాలని, నెట్వర్క్ లేని సెల్ ఫోన్ ఇచ్చి డేటా అంతా ప్రతిరోజు పంపాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.

అంగన్వాడీ టీచర్లకు 5 జి ఫోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దసరా సెలవులు కూడా వర్తింప చేయాలన్నారు. కరెంటు సామాన్లకి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని, కొన్ని సెంటర్లకు కిరాయిలు ఇంకా చెల్లించలేదని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. క్రచ్ సెంటర్లు తీసుకువచ్చి అదనపు పని భారాన్ని మోపి పొమ్మనలేక పొగ పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. అంగన్వాడి సెంటర్లపై అదనపు భారాలు మోపి ఆ సెంటర్లన్నీ ప్రైవేటు యాజమాన్యాలకి అప్పజెప్పే విధంగా అంగన్వాడీలనే రద్దు చేసే విధంగా అంగన్వాడీలను రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.  నేడు మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతితులలో కలిసి ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేసి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. తక్షణమే పరిష్కరించకుంటే సెప్టెంబర్ 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కోశాధికారి కళావతి, జిల్లా గౌరవాధ్యక్షులు రాజ్యలక్ష్మి, జిల్లా నాయకురాలు శైలజ, రత్నకుమారి, కే శైలజ, భాను, రమ్య, చుక్కమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు