15-09-2025 06:25:36 PM
మఠంపల్లి: తెలుగు కీర్తి కిరీటం పురస్కారం అందుకున్న కర్ల శ్రీనివాస్, ఆర్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు కీర్తి కిరీటాలు అంతర్జాతీయ పురస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమం హైదరాబాద్ శారదా మ్యూజిక్ అకాడమీలో జరిగింది.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండలానికి చెందిన కవి గాయకుడు కర్ల శ్రీనివాస్ కు జానపద గీతాల ఆలాపనలో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా సినీ నటి నిర్మాత బత్తిని కీర్తి లతా గౌడ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు రెండు రాష్ట్రాల నుండి అన్ని రంగాలలో ప్రత్యేకతను కనబరిచిన వారిని గుర్తించి వారందరికి అంతర్జాతీయ పురస్కారాలు అందించడం విశేషం. సభాధ్యక్షులు నాదముల రామారావు, ప్రధాన కార్యదర్శి అభినందన చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. సమాజంలోని అన్ని రంగాలలో ఆయా సేవలందిస్తూ ఆ వ్యక్తులను గుర్తించి తెలుగు కీర్తి కిరీటాలు అంతర్జాతీయ పురస్కారం అందించిన ఆర్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ సంస్థకు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల మఠంపల్లి వాసులు బంధు మిత్రులు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు.