15-09-2025 06:28:34 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): మాస్టర్ విక్టరీ షాటోకాన్ ఇండియా 29వ నేషనల్ ఓపెన్ కరాటే పోటీ(karate competitions)ల్లో కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. హైదరాబాద్ లో జరిగిన కటాస్, కుమితే విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అదేవిధంగా తస్విక ,అశ్విత్, సహస్ర, యశ్వంత్, ప్రహర్షిని, దీక్షిత, సమ్వేధ్య, సహస్ర, వందన, మనీష్లు పలు విభాగాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన విద్యార్థుల నిర్వాహకుడు జూల శ్రీనివాస్ ని పలువురు సీనియర్ గ్రాండ్ మాస్టర్లు, మాస్టర్లు సన్మానించారు.