27-07-2025 12:35:19 AM
మహబూబ్‌నగర్, జూలై 26 (విజయక్రాంతి): పాలమూరు బీజేపీలో అంతర్యు ద్ధం రాష్ట్ర అధ్యక్షుడు ఎదుటే బయటపడిం ది. ఎంపీ ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తి అ యినప్పటికీ అప్పటి నుంచి ఉన్న ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్‌ల మధ్య సఖ్యత లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలు నిజం చేస్తూ శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎదుటే ఎంపీ డీకే అరుణ వర్గీయులు.. శాంతకుమార్ అనుచరురులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో బయటపడింది. శనివారం మ హబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ రాజాపూర్ మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నివాళు లు అర్పించారు.
అనంతరం అన్నపూర్ణ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాంతకుమార్ స్టేజ్ పైకి ఎక్కే సమయంలో గో బ్యాక్ శాంత కుమార్ అంటూ డీకే అరుణ వర్గీయులు నినాదాలు చేశారు. శాంత కుమార్ ఎట్టి పరిస్థితుల్లో స్టేజ్ పైకి ఎక్కవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో డీకే అరుణకు మద్దతు ఇవ్వలేదని, శాంత కుమార్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని పలువురు నేతలు ఆరో పించారు.
ఇదే సమయంలో శాంత కుమార్ మద్దతుదారులు సైతం ఆందోళన చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కలుగజేసుకొని బీజేపీ ఐక్యతకు మారుపేరని, ఇలాంటి ఆందోళనలు చేయవద్దంటూ సర్ది చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు భారీ ఎత్తున సభ జరుగుతున్న ప్రాంతంలోని అన్నపూర్ణ గార్డెన్‌కు చేరుకొని ప్రశాంతంగా సభ జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు.
పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ
కొందరి పేర్లు తాను తీసుకోనని, వారు గత ఎంపీ ఎన్నికల్లో పార్టీ లైన్ క్రాస్ చేసి, ఎన్నికల్లో తాను ఓడిపోవాలని పని చేశారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. తనకు వ్య తిరేకంగా ఎవరు పనిచేశారో, ఎవరు అనుకూలంగా పని చేశారో అధిష్ఠానం వద్ద రిపో ర్ట్ ఉన్నదని, ఆ రిపోర్ట్‌ను రాష్ట్ర అధ్యక్షుడు పరిశీలించాలని కోరారు. ఆనాడు రాజీనామాలు చేయించినోళ్లు ఇవాళ ఈ మీటింగ్‌కు రావడం ఏమిటని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికలకు, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా రాజీనా మాలు చేసిన వారిని సస్పెండ్ చేయాలన్నారు. క్రమశిక్షణ రహిత్యంగా వ్యవహరి స్తున్న వారిని పార్టీ నుంచి తొలగించాలన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు వేశామని శ్రీరాముడుపై ఒట్టేసి నిజం చెప్పాలని ఎంపీ డీకే అరుణ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసే పనిచేస్తామని, పార్టీకీ వ్యతిరేకంగా పని చేసిన కార్యకర్తలకు పనిష్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థలు ఎన్నికలు విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త ప్రతి గడపకు చేరుకొని ప్రచా రం చేయాలని సూచించారు. కేసీఆర్ పుణ్య మా అని పాలమూరు పడవబడ్డదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలను కూడా ఇచ్చిం దని అవన్నీ మోసపూరితమైనటువంటి అ న్ని ప్రజలకు తెలిసిందన్నారు.
అంతర్లీనంగా చర్చించుకోవాలి: రాంచందర్‌రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు బీజేపీ మారుపేరని, ఎలాంటి విభేదాలు ఉన్నా అంతర్లీనంగా చర్చించుకోవాలని సూ చించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆందోళన చేయడం మంచి విధానం కాదని హెచ్చరించా రు. అందరూ ఐక్యంగా ఉండి పార్టీ బ లోపేతానికి కృషి చేయాలని సూచించారు.
పాలమూరు జిల్లా అభివృద్ధికి ఎల్లవేళల అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి కార ్యకర్త సైనికుడిలా పని చేయాలని సూ చించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ప్రాజెక్టుల పనులను పూర్తిగా రా ష్ట్ర ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 46శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ ఇందులో 10శాతం ముస్లింలకు ఇ స్తూ.. 32 శాతం మాత్రమే బీసీలకు స రి చేసేలా కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.