27-07-2025 12:38:17 AM
-కేటీఆర్ సహాయంతో లండన్ నుంచి స్వగ్రామానికి చేరిన నవీన్ మృతదేహం
మహబూబాబాద్, జూలై 26 (విజయక్రాంతి): మహబూబా బాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మునగలవీడు గ్రామానికి చెందిన నల్లాని భీంరావు కుమారుడు నల్లాని నవీన్‌కుమార్ (29) ఈ నెల 3న లండన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లిన నవీన్ మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి తీసుకురావడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడం, కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో ఈ విషయాన్ని వుసిరికపల్లి వాసుదేవరావు బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన కేటీఆర్ లండన్ బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్, అక్కడి ఇండియన్ ఎంబసీ అధి కారులతో సంప్రదించి, అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయం అందించి నవీన్ మృత దేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేయించారు. ఈ విషయంలో మునగలవీడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నల్లాని శోభ పాపారావు, మాజీ సర్పంచ్ నల్లాని నవీన్ కూడా సహకారం అందించారు. 23 రోజుల నిరీక్షణ తర్వాత స్వగ్రామానికి చేరిన నవీన్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.