27-07-2025 12:35:03 AM
- జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడులు సహించం
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నాన్-రెసిడె న్షియల్ ప్రాపర్టీలకు ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ, ఫీజు వసూలు బాధ్యత పూర్తిగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లదేనని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆస్తిపన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, పెండింగ్ కేసు లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
నగరం లో 3.5 లక్షల నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయని, వీటన్నింటికీ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జారీ చేయాలని పేర్కొ న్నారు. ప్రతి వారం జోనల్ కమిషనర్లు తమ పరిధిలో నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీల సంఖ్య, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, పన్ను వసూలు పురోగతి వివరాలను అందించాలని ఆదేశించారు. కాగా కోర్టు ధిక్కరణ కేసుల పురోగ తిపై జోనల్ కమిషనర్లు వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమీక్షించాలని కమిషనర్ కర్ణ న్ ఆదేశించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో కోర్టు కేసుల పరిష్కారంపై డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిపై దాడులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారిపై రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించిన ఘటనపై ఆయన ఆరా తీశారు. జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఘటన వివరాలను కమిషనర్‌కు వివరించారు. దాడికి యత్నించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలిపారు. బాధ్యులకు శిక్ష పడేలా కేసును ఫాలో అప్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రవి కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.