11-09-2025 01:41:14 AM
అమీన్ పూర్/ రామచంద్రాపురం, సెప్టెంబర్ 10 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నూతన రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ హిపాల్ రెడ్డి అన్నారు.
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో 11 కోట్ల 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 2 మిలియన్ లీటర్ల జి ఎల్ ఆర్ ఎస్ రిజర్వాయర్ పైపులైన్ వ్యవస్థను బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభిం చారు.
సుమారు 300లకు పైగా కాలనీలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న అమీ న్ పూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యకు ఇబ్బందులు తలెత్తకుండా ఐదు రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు.
నూతన కాలనీలలో సైతం మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తావినీరు అందిస్తున్నామని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్, ఏఈ పూర్ణేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉస్మాన్ నగర్లో ఆధునిక రిజర్వాయర్ల ప్రారంభం..
రామచంద్రాపురం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్లో స్థానిక ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు నిర్మించిన ఆధునిక రిజర్వాయర్లను ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్కు మొత్తం రూ.33.13 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించినట్లు తెలిపారు.
ఇందులో 2 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్, 4 మిలియన్ లీటర్ల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్, ఆధునిక పంపు హౌస్తో పాటు విస్తృత పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కార్యక్ర మంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.