11-09-2025 12:37:15 AM
మోదీతో వాణిజ్య చర్చల కోసం నిరీక్షిస్తున్నా: ట్రంప్
నేనూ ఎదురుచూస్తున్నా: మోదీ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై 100% సుంకాలు విధించండి: ఈయూని కోరిన ట్రంప్!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: నిన్న, మొన్నటి వరకు భారత్‌పై విషం చిమ్మి న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చారు. వాణి జ్య అడ్డంకులను తొలగించేందుకు అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని రెండు దేశాలకు విజ యవంతమైన ముగింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారత్‌అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపేందుకు ఆనందిస్తున్నా.
ఆప్త మిత్రుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. రాబోయే వారాల్లో మోదీతో మాట్లాడుతా. విజయవంతమైన ముగింపులో రెండు గొప్ప దేశాలకు ఎటువంటి ఇబ్బందులు రావని నేను భావిస్తున్నా’ అని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశా రు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ట్రంప్‌తో మాట్లాడేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. భారత్, అమెరికా సన్నిహిత స్నేహితులని పేర్కొన్నారు.
నేనూ ఎదురుచూస్తున్నా: మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ట్రంప్ పోస్ట్‌పై స్పందిస్తూ.. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ‘భారత్, అమెరికా సన్నిహిత స్నేహితులు, సహజ భాగస్వాములు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సంబంధాలు మరింత ధృడంగా తయారవుతాయని ఆశిస్తున్నా.
ఈ చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు మా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా. రెండు దేశాల్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్‌ను అందించేందుకు మేం కలిసి పని చేస్తాం’ అని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు రష్యా నుంచి కారుచవకగా చమురును కొనుగోలు చేస్తూ భారత్ సొమ్ము చేసుకుంటుం దని ఆరోపించిన ట్రంప్ తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో చర్చల కోసం ఎదురుచూస్తూ.. ప్రధాని మోదీ స్నేహితుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు వేయండి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా దేశాలపై 100 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యురోపియన్ యూనియన్ (ఈయూ)ని కోరినట్టు సమాచారం. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకే ట్రంప్ ఈయూని సుంకాలు వేయమని కోరినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యు ద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి కోసం ఈయూ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 50 శాతం, చైనాపై 30 శాతం సుంకాలు అమలు చేస్తున్నారు.