11-09-2025 01:41:57 AM
హన్మకొండ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారు.
సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన త్యాగాలు మనం ఎప్పటికీ మరచి పోలేం అని యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాల్గొనాలి అని అన్నారు. ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షులు సురేందర్,కుమార్ యాదవ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం..
జనగామ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని.. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాన్ఫెరెన్స్ హల్‌లో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా... అదనపు కలెక్టర్ బెన్ష లోమ్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అలాగే వివిధ శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమం లో వెనుకబడిన తరగతుల జిల్లా అభివృద్ధి అధికారి నరసింహ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివ రాజ్ యాదవ్,
చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల సంపత్, మనవరాలు శ్వేత, జిల్లా టౌన్ రజక సంఘం అధ్యక్షుడు నర్సింహులు, నాయి బ్రాహ్మణ సంఘ కార్యదర్శి అవినాష్, బిసి సంఘం అధ్యక్షుడు వీరస్వామి,బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాయ మల్లేష్,దిశా కమిటీ సభ్యుడు శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దీరవనిత చిట్యాల ఐలమ్మ
మహబూబాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : దొరల అహంకారానికి వ్యతిరేకంగా, తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దీరవనితగా చిట్యాల ఐలమ్మ నిలిచారని పలువురు వత్తలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం చిట్యాల ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూస్వామ్య కోసం ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్ , బీసీ సంక్షేమ అధికారి నరసింహమూర్తి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ రాజేశ్వర్, అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో వేరువేరుగా ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కన్నాయిగూడెం మండల కేంద్రంలో
కన్నాయిగూడెం, సెప్టెంబరు10 (విజయక్రాంతి) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల(చాకలి)ఐలమ్మ 40వ వర్థంతి వేడుకలు పైడకుల సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బీసీ జేఏసీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ముదురుకోళ్ళు భిక్షపతి మరియు govt.AHS హెడ్ మాస్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు పలువురు చిట్యాల (చాకలి)ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నైజం రజాకారుల ఎదిరించి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ యూత్ నాయకులు బొగ్గుల సంతోష్, తొంగలి కిరణ్,రజక సంఘం ఉపాధ్యక్షులు వేములవాడ రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల సందీప్, కోశాధికారి ముక్కెర సాయి, వెలిశాల మహేందర్,వేములవాడ శ్రీనివాస్, శ్రీరాముల సాంబయ్య, అంజయ, కల్లూరి నాగయ్య, శ్రీరాముల నాగేశ్వరావు,శ్రీను, మరియు పాఠశాల టీచర్స్ విద్యార్థులు, రజక సంఘం నాయకులు, పత్రిక విలేఖరుల పాల్గొనడం జరిగింది.
భూపాలపల్లి జిల్లాలో..
రేగొండ/భూపాలపల్లి సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో కలెక్టర్ కార్యాల యంలో కలెక్టర్ రాహుల్ శర్మ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బిఆర్‌ఎస్ అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి,అలాగే తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇంచార్జీ రవి పటేల్ అధ్వర్యంలో సుభాష్ కాలనీ లో గల బస్టాండ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాల్లో ఆయా సందర్భాల్లో వేరు వేరుగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిధాయ కమని, భూస్వాములకు, పెత్తందారులకు ఎదురొడ్డి నిల్చుని ఉద్యమాలకు బాసటగా నిలిచిందని అన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో గళమెత్తిన ఓబిసి మహిళ లోకం
హనుమకొండ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళ చైతన్య దీప్తి చాకలి ఐలమ్మ వర్ధంతివరంగల్ నగరంలోని హనుమకొండ హరిత కాకతీయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బుధవారం హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ లో ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి సభకు మహిళలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవడంతో ప్రాంగణం సాయుధ పోరాట నినాదాలతో హోరెత్తింది.
భారీ ఎత్తున జరిగిన మహిళా చైతన్య సదస్సుకు మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిం చారు. సదస్సుకు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి. విజయ లక్ష్మి అధ్యక్షత వహించగా ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాద వ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు.
ప్రభుత్వం స్కాలర్ షిప్స్ ఇవ్వక బీసీ విద్యార్థులు నష్టపోతున్నారు.స్కాలర్ షిప్స్, ఉద్యోగాలు, ఎమ్మెల్యే సీట్లు సాధించేలా మహిళల్లో చైతన్యం రావాలనీ మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి,ఓబీసీ నాయ కులు అరవింద్ స్వామి, ఎమ్‌ఎన్ మూర్తి, వేణుమా ధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, , పద్మజ, ప్రవళిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత, విద్యార్థినిలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.