11-09-2025 12:34:08 AM
-ఎన్‌ఐఏ అదుపులో ఐసిస్ సభ్యుడు
-ఎయిర్ పిస్టల్ స్వాధీనం
బోధన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ లో మరోసారి ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. పక్కా సమాచా రం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించా యి. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి.
అతని వద్ద ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కలిసి ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉం చాయి. ఈ క్రమంలో జార్ఖండ్‌లోని రాంచీ లో అషర్ డానిష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాయి.
అతడ్ని ప్రశ్నించిన అనంతరం అత డు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తం గా పలు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తనిఖీలు నిర్వహించి, ఐసిస్ సభ్యుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
కాగా గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్రలింకులకు సంబంధించి ఎన్‌ఐఏ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారి వివరాలను సైతం జిల్లా పోలీసు వర్గాల నుంచి సేకరించుకున్నట్టు తెలుస్తోంది.
రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడటం కలకలం రేపుతున్నది. వీరిని కున్న చేర్చుకుంటున్నది ఎవరు? వీరిని ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నది ఎవరు అనే విషయమై జిల్లా పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు.