calender_icon.png 13 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడి

12-11-2025 12:00:00 AM

నంగునూరు, నవంబర్ 11 : ఖాతాదారులకు అత్యుత్తమ సేవలను అందించడంలో యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందే ఉంటుందని బ్యాంక్ మేనేజర్ ఇటిక్యాల అనిల్ అన్నారు. యూనియన్ బ్యాంక్ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని,నంగునూరు శాఖలో ఖాతాదారుల సమక్షంలో కేక్ కట్ చేశారు.అనంతరం బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ..నంగునూరు యూనియన్ బ్యాంక్ వ్యాపారం రూ.170 కోట్లకు పైగా చేరిందని వెల్లడించారు.

46 ఏళ్ల క్రితం నంగునూరు లో ప్రారంభమైన శాఖ గ్రామీణ ప్రజలకు అనేక రకాల ఆర్థిక సేవలను విజయవంతంగా అందిస్తోందని తెలిపారు.బ్యాంకు సిబ్బంది నిబద్ధత,ఖాతాదారుల నిరంతర సహకారం వల్లే యూనియన్ బ్యాంక్ తన ప్రయాణాన్ని ఇంత విజయవంతంగా కొనసాగించ గలుగుతుందని మేనేజర్ అనిల్ అన్నారు.ఈ వేడుకలో  ఫీల్ ఆఫీసర్ లక్వీందర్ సింగ్,ఉద్యోగులు బాల్ రాజు,మాలతి,శ్రీనివాస్, బాలాచారి, సంపత్, భూపతి ఖాతాదారులు పాల్గొన్నారు.