12-11-2025 12:00:00 AM
పటాన్‌చెరు, నవంబర్ 11 : ప్రఖ్యాత భారతీయ గాయని, స్వరకర్త, రచయిత్రి విద్యా షా సూఫీ సంగీతం ‘రంగ్ సుఫియానా’ మంగళవారం హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ)లో ప్రేక్షకులను మంత్రుముగ్ధులను చేసింది. సంస్కృతి పేరిట కేఎస్ పీపీ నిర్వహిస్తున్న తొలి సాంస్కృతిక కార్యక్రమం ఇది.
దక్షిణ భారత కుటుంబంలో జన్మించి, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన విద్యా షా విభిన్న సంగీత సంప్రదాయాలను సమాన అభిరుచితో సాధన చేశారు. తుమ్రీ, దాద్రా లేదా సూఫీ అయినా దాని స్ఫూర్తిలో పూర్తిగా మునిగిపోయినప్పుడే నిజమైన సంగీతం ప్రారంభమవుతుందని ఆమె విశ్వసిస్తారు. సంగీతం హృదయాలను తాకుతుంది. ఆ భావోద్వేగ సంబంధం అన్నిరకాల సంగీతానికి సారాంశం అని ఆమె తన ప్రదర్శన సమయంలో నిరూపించడమే గాక, తన హృదయపూర్వక ప్రదర్శనలు, సంభాషణల ద్వారా ప్రేక్షకులనుఆకట్టుకున్నారు.