calender_icon.png 23 September, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ భూములు కాపాడాలని ధర్నా

23-09-2025 12:23:43 AM

మేడ్చల్, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్ శివారులో ఆలయ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానికులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు ఆలయ భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు.

అనంతరం కలె క్టర్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. ఆలయానికి చెందిన 639, 640, 641 సర్వే నెంబర్లలో కొందరు అక్రమంగా ప్లాట్లు చేసి విక్రయించారని, వాటిని అధికారులు అక్రమంగా క్రమబద్ధీకరిస్తున్నారని పే ర్కొన్నారు. ప్లాట్లు చేసి కోట్ల రూపాయలు దండుకున్న వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు అన్నారు.

ఇక్కడ ఇల్లు నిర్మించేవారు ఎవరు కూడా స్థానికులు కాదని, ఇతర ప్రాం తాల వారు, ధనవంతులేనన్నారు. ఈ భూ మిని కాపాడాలని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపా రు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనిస్పష్టంచేశారు.